: బుర్రిపాలెంలో హెల్త్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ పీవీ రామారావు, అతని టీమ్ కు ధన్యవాదాలు: మహేష్ బాబు


సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా వారి స్వగ్రామం బుర్రిపాలెంలో హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ పీవీ రామారావు, అతని టీమ్ సభ్యులకు మహేష్ బాబు ఫేస్ బుక్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. చిన్నపిల్లల ఆరోగ్యం కోసం డాక్టర్లు చేసిన కృషి చాలా గొప్పదని అన్నాడు. మొత్తం 210 మంది చిన్నారులకు ఈ క్యాంప్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందించారని చెప్పాడు. బుర్రిపాలెంను తాను దత్తత తీసుకున్న తర్వాత నిర్వహించిన 12వ హెల్త్ క్యాంప్ ఇదని తెలిపాడు.

  • Loading...

More Telugu News