: సెల్ఫీ ఎలా తీయాలో చిన్నారితో చెప్పించుకుని నేర్చుకున్న ప్రణబ్ ముఖర్జీ... ఆపై తీసుకున్న చిత్రమిదే!
రాష్ట్రపతి పదవీకాలాన్ని ముగించుకున్న తరువాత ట్విట్టర్ లో ఖాతాను ప్రారంభించడం ద్వారా ప్రజలకు దగ్గరైన ప్రణబ్ మఖర్జీ, సెల్ఫీ ఎలా తీయాలో నేర్చేసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన హమ్జా సైఫీ అనే బాలుడి నుంచి సెల్ఫీ ఎలా దిగాలో నేర్చుకున్నానని చెబుతూ, ఇటువంటి పిల్లలను కలవడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. హమ్జాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశారు. ఇక ఈ ఫోటో ఎంతో క్యూట్ గా ఉందని వందలాది మంది కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.