: చంద్రబాబు ఇమేజ్ చాలా గొప్పది, ఆయనేంటో మరోసారి తెలిసింది: చినరాజప్ప


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఇమేజ్ కాకినాడను కూడా పార్టీ గొడుగు కొందకు తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తుండటంపై స్పందించిన ఆయన, గత మూడు సంవత్సరాల వ్యవధిలో జరిగిన అభివృద్ధి ఫలితమే ఈ ఓట్లని స్పష్టం చేశారు.

ప్రజలకు చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉందని, ఆయనేంటో ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి తెలిసొచ్చిందని, నంద్యాల ఫలితమే ఇక్కడ కూడా పునరావృతం కావడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం స్థాయిలో కాకినాడను అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా తొలుత డ్రైనేజీల మరమ్మతులు చేపట్టనున్నామని అన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News