: కాకినాడ కార్పొరేషన్ టీడీపీదే... 17 డివిజన్లలో టీడీపీ గెలుపు...మూడింటిలో వైఎస్సార్సీపీ!


నంద్యాల ఉపఎన్నికల్లో సత్తాచాటిన టీడీపీ కాకినాడ కార్పోరేషన్ లో కూడా తనకు తిరుగులేదని నిరూపించింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆది నుంచి టీడీపీ ఆధిక్యం చూపిస్తోంది. ఇప్పటికి పదిహేడు డివిజన్లలో టీడీపీ విజయం సాధిచింది. మరో ఐదు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడు డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. దీంతో కాకినాడ కార్పొరేషన్ టీడీపీ పరమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News