: నాల్గో వన్ డే.. ఓటమి దిశగా శ్రీలంక జట్టు
నాల్గో వన్డేలో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు వికెట్లు కోల్పోతుండటంతో స్కోర్ బోర్డు నీరస పడింది. 40 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంకజట్టు 192 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో ధనుంజయ, పుష్పకుమారా కొనసాగుతున్నారు. కాగా, లంక జట్టులో మ్యాథ్యూస్ ఒక్కడే హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేశాడు.