: వీహెచ్ తాతయ్య ఈ సినిమా చూడాలి.. అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటే తీసేస్తా: ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు


వీహెచ్ తాతయ్య ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటే కనుక అలాంటి సీన్లంటినీ తొలగిస్తానని  ఆ చిత్ర దర్శకుడు సందీప్ అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సంబంధించి బస్సులపై అంటించిన పోస్టర్లు తాతయ్యకు నచ్చకపోవడంతో, వాటన్నింటిని తొలగించామని, థియేటర్లలో కూడా ఆ పోస్టర్లు లేకుండా చేశామని చెప్పారు. ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ‘అర్జున్ రెడ్డి’కి సంబంధించి అలాంటి పోస్టర్లు లేవని, దీని వల్ల చాలా డబ్బులు నష్టపోయామని అన్నారు. ముద్దు సీన్ లో ఉన్న ఎమోషన్ ను మాత్రమే పోస్టర్ ద్వారా ప్రమోట్ చేశాము తప్పా, వేరే ఉద్దేశంతో కాదని చెప్పారు.

  • Loading...

More Telugu News