: హరికేన్ హార్వీ బాధిత సహాయ నిధికి మిలియన్ డాలర్లు అందజేసిన లియోనార్డో డికాప్రియో
లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్ తరఫున హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో యునైటెడ్ వే హార్వీ రికవరీ ఫండ్‌కి 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. ఆరు కోట్లు) సహాయం చేశారు. ఆగస్టు 30న హార్వీ బాధితుల కోసం యునైటెడ్ వే వరల్డ్ వైడ్ సహాయ నిధిని ప్రారంభించింది. ఆ వెంటనే లియోనార్డో నుంచి ఇంత మొత్తంలో సహాయం రావడంతో సంస్థ సీఈఓ బ్రయాన్ గాలగర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సహాయనిధిలో ప్రతి ఒక్క డాలర్ బాధితులకు అందేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. గతంలో 2004 సునామీ, హైతీ భూకంపం, హరికేన్ శాండీ సమయాల్లో డికాప్రియో ఫౌండేషన్ భారీ మొత్తాన్ని సహాయం చేసింది. లియోనార్డో బాటలోనే హాలీవుడ్ ప్రముఖులు రూబీ రోస్, రేచల్ రే, ఎలెన్ డీజెనరీస్, ఫాలవుట్ బాయ్‌లు హరికేన్ హార్వీ సహాయనిధికి సహాయం చేశారు.