: ఐఫోన్ 8లో `హోం` బటన్‌ను తొలగించనున్న ఆపిల్... స్క్రీన్ సైజ్ పెంచడం కోసమే!
ఐఫోన్- 8లో స్క్రీన్ పరిమాణం పెంచే ఉద్దేశంతో `హోం` బటన్‌కు ఆపిల్ స్వస్తి పలికే అవకాశాలున్నాయని బ్లూమ్‌బర్గ్ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. `హోం` బటన్ సహాయం లేకుండా ఆన్-స్క్రీన్ సంకేతాలతో నావిగేట్ చేసే అవకాశాన్ని ఆపిల్ కల్పించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. 2007లో ఐఫోన్ మొదటిసారిగా మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి `హోం` బటన్ ప్రత్యేకత అయింది. ఇప్పుడు దీన్ని తొలగించడమనేది ఐఫోన్ రూపురేఖల్లో పెద్ద మార్పుగానే పరిగణించాల్సి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఐఫోన్లలో దాదాపు 70 శాతం నావిగేషన్ పనులు `హోం` బటన్ ద్వారానే జరుగుతాయి. గతంలో ఐఫోన్ 7లో `హోం` బటన్‌లో స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే.