: విలువిద్యలో రాణిస్తోన్న జ్యోతి సురేఖకు ఏపీ సర్కారు భారీ నజరానా!


విలువిద్యలో రాణిస్తోన్న కేఎల్‌యూ విద్యార్థిని వెన్నం జ్యోతి సురేఖ ఇటీవ‌లే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆమె ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుని కలిసింది. ఆమెను అభినందించిన చంద్ర‌బాబు ఆమెకు భారీ న‌జ‌రానాను ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో 500 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం, కోటి రూపాయ‌ల న‌గ‌దును ప్రోత్సాహ‌కంగా ఇస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగానికి కూడా ఆమె పేరును సిఫార‌సు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  

  • Loading...

More Telugu News