: బెనజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్ కు షాకిచ్చిన కోర్టు!


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు పాకిస్థాన్ కోర్టు షాకిచ్చింది. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ దేశం నుంచి పరారయ్యాడని కీలక ప్రకటన చేసింది. బెనజీర్ భుట్టో హత్యకు కుట్ర జరిగిన విషయం ముషారఫ్ కు తెలుసని... ఆమె హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని తేల్చి చెప్పింది. 2007 డిసెంబర్ 27న భుట్టోను రావల్పిండిలో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సభలో పాల్గొని వస్తున్న ఆమెపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హత్య చేశారు.

  • Loading...

More Telugu News