: ఇరగదీస్తున్న కోహ్లీ, రోహిత్ శర్మ.. బెంబేలెత్తిపోతున్న శ్రీలంక బౌలర్లు
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలింగ్ ను ఊచకోత కోస్తూ... కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో తన 29వ సెంచరీని కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ కూడా ధాటిగా ఆడుతున్నాడు. 66 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. ఇండియా స్కోరు 25.5 ఓవర్లకు 200 పరుగులు.