: తరగతి గదిలో విద్యార్థిని మూడు నిమిషాల్లో 40 చెంపదెబ్బలు కొట్టిన టీచర్.. వీడియో వైరల్!
తరగతి గదిలో ఓ విద్యార్థిని ఓ టీచర్ మూడు నిమిషాల్లో 40 చెంపదెబ్బలు కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సదరు ఉపాధ్యాయురాలు హాజరు తీసుకుంటుండగా ఓ బాలుడు హాజరు పలకలేదు. దీంతో ఆ టీచర్‌కి కోపం వచ్చేసింది. అతడిని ముందుకు పిలిచి చెంప దెబ్బలు కొట్టింది. తరగతి గదిలో అందరు పిల్లలు చూస్తుండగానే ఆ బాలుడిని అదేపనిగా కొడుతూనే ఉంది. ఈ ఘటన ఆ తరగతి గదిలోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ టీచర్‌ను ఆ స్కూల్ యాజమాన్యం తొలగించింది. ఈ ఘటనపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.