: ఫోర్బ్స్ తాజా జాబితా... సల్మాన్, అమీర్, అక్షయ్ లను వెనక్కు నెట్టేసిన షారూక్


బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేయగా, ఈ సంవత్సరం కింగ్ షారూక్ ఖాన్ తొలి స్థానంలో నిలిచాడు. ఆయన 'రయీస్' చిత్రంతో పాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంటూ 38 మిలియన్ డాలర్లు సంపాదించాడని, మిగతా వారికన్నా అధిక మొత్తంలో ఆదాయం పొందాడని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక రెండో స్థానంలో 'భజరంగీ భాయిజాన్'తో హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్ల ఆదాయంతో నిలువగా, అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక వీరందరికీ దూరంగా కేవలం 12.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో అమీర్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడని ఫోర్బ్స్ వెల్లడించింది. ఐదో స్థానంలో 11.5 మిలియన్ డాలర్లతో హృతిక్ రోషన్, ఆరో స్థానంలో 11 మిలియన్ డాలర్లతో దీపికా పదుకొనే, ఆపై 10 మిలియన్ డాలర్ల ఆదాయంతో రణవీర్ సింగ్, అంతే మొత్తం ఆదాయంతో ప్రియాంకా చోప్రా 7వ స్థానాన్ని పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ లు 9, 10వ స్థానాల్లో ఉన్నారని ఫోర్బ్స్ తెలియజేసింది.

  • Loading...

More Telugu News