: మోహన్‌లాల్ `మహాభారత` సినిమాలో కర్ణుడిగా నాగార్జున?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న `మహాభారత` చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ నాగార్జునను కలిసిందనే విషయంపై ఆయనే స్వయంగా స్పష్టతనిచ్చారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. కర్ణుడి పాత్ర కోసం తనని అడిగారని, ఇంకా ఈ విషయానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని నాగార్జున చెప్పారు.
సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికి మోహన్‌లాల్ పోషిస్తున్న భీముని పాత్ర మాత్రమే పట్టాలెక్కింది. ఈ కథ మొత్తం భీముని పాత్ర చుట్టే తిరగనుంది. ప్రముఖ రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ రాసిన `రండమూళం` కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రూ. 1000 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో నటించేందుకు భారతీయ సినీ రంగంలోని ప్రధాన నటీనటులను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్ర షూటింగ్‌ను 2018లో ప్రారంభించనున్నారు. 2020లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.