: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడా?... సందేహం కలిగిస్తున్న ముషారఫ్ మాటలు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడనే అనుమానాలను కలిగిస్తున్నాయి. పాకిస్థాన్ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, `దావూద్ పాకిస్థాన్‌లో ఉన్నాడని భారత్ చాలా కాలంగా ఆరోపిస్తూనే ఉంది. ఒకవేళ అతడు ఇక్కడే ఉన్నా... అతని విషయంలో మేం భారత్‌కి ఎందుకు సాయం చేయాలి? భారత్ ముస్లింలను చంపేస్తుంది. అందుకే దావూద్ భారత్ మీద పగతీర్చుకుంటున్నాడు` అన్నారు. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడంటూ గత పదేళ్లుగా భారత్ ఆరోపిస్తూనే ఉంది. అంతేకాకుండా అమెరికా హతమార్చిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందని గతంలో భారత్ ఆరోపించింది.