: 6,500 రావాల్సి ఉంటే ఆరున్నర కోట్లు ఇచ్చేశారు.. 39 లక్షలు ఖర్చు పెట్టేసింది.. తిరిగి చెల్లించమంటున్నారు!
ఒక చిన్న పొరపాటు మూడు నెలల పాటు ఒక యువతిని కోటీశ్వరురాలుని చేసింది. సౌతాఫ్రికాలోని వాల్టర్ సిస్లు యూనివర్సిటీలో ఓ విద్యార్థిని చదువుతోంది. నేషనల్ స్టూడెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ స్కీంలో భాగంగా ఆహార అలవెన్స్ ను బదలాయించే క్రమంలో పొరపాటుగా ఆమె బ్యాంకు ఖాతాలోకి సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. వాస్తవానికి ఆమెకు 6,500 రూపాయలు రావాల్సి ఉంది.
అయితే జూన్ 1న ఆమె ఖాతాలోకి ఈ డబ్బు రాగా, ఆమె హ్యాపీగా వాడుకుంది. ఆగస్టు 13 వరకు ఆమె సుమారు 39 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు, రికార్డులను పరిశీలించి, నిన్నటికి క్లారిటీకి వచ్చి, యువతిని అడిగారు. దీంతో ఆమె మిగిలిన డబ్బును తిరిగి వారికి చెల్లించింది. అయితే ఆమె ఖర్చు చేసిన 39 లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తామని నేషనల్ స్టూడెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ అధికారులు చెబుతున్నారు.