: దసరా బొనాంజా... ఏపీలో ఈసారి సెలవులు 14 రోజులు
పాఠశాల విద్యార్థులకు ఈ సంవత్సరం దసరా సెలవులు ఏకంగా 14 రోజులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలలకూ సెప్టెంబర్ 19 నుంచి 30 వరకూ దసరా సెలవులను ప్రకటించింది. ఆపై అక్టోబర్ 1న ఆదివారం, 2న గాంధీ జయంతి సెలవులు రావడంతో, 3వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్ 11 నుంచి 18 వరకూ ఎస్ఏ-1 (కామన్ సమ్మేటివ్ అసెస్ మెంట్) ఎగ్జామ్స్ ఉంటాయని, ఆ మరుసటి రోజు నుంచి సెలవులని ప్రభుత్వం తెలిపింది.