: ‘సిగ్గుచేటు’ అంటూ ఆర్బీఐని దులిపేసిన చిదంబరం!


కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆర్బీఐపైనా, ప్రభుత్వంపైనా దుమ్మెత్తి పోశారు. ట్విట్టర్ వేదికగా తూర్పారబట్టారు. నోట్ల రద్దు తర్వాత వెనక్కి వచ్చిన  నోట్ల గణాంకాలను భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు తర్వాత ఒక్కశాతం పెద్ద  నోట్లు తప్ప దాదాపు అన్నీ వెనక్కి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. అన్నీ వెనక్కి వస్తే మరి దేశంలోని నల్లధనం అంతా ఏమైపోయిందని చిదంబరం ప్రశ్నించారు. ‘ఇది సిగ్గు చేటు’ అంటూ ఆర్బీఐని తీవ్రస్థాయిలో విమర్శించారు. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకే నోట్ల రద్దును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఇదంతా పద్ధతి ప్రకారం చేసిన ప్రచారం తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. ‘‘డబ్బు ఎక్కడుంది? జైలులో ఎవరున్నారు?’’ అని ప్రధానిని నిలదీశారు.

  • Loading...

More Telugu News