: పళనికి మోదం... డీఎంకేకు ఖేదం... విశ్వాస పరీక్ష లేదని గవర్నర్ స్పష్టీకరణ
తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రభుత్వానికి సరిపడా మద్దతు లేదని, తక్షణం విశ్వాస పరీక్ష చేపట్టాలని కోరుతూ డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్ ను గవర్నర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అనిశ్చితికి కారణమైన 19 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే ఉన్నారని స్టాలిన్ కు స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో తాను పళనిస్వామిని రాజీనామా చేయమని కోరలేనని ఆయన తెలిపారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది.