: నాతో పాటు పోరాటానికి సిద్ధం కండి: తమిళ ప్రజలకు కమల్ పిలుపు
తమిళనాడు రాజకీయాలపై, రాజకీయనాయకులపై విమర్శలు గుప్పిస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్ మరోమారు విరుచుకుపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిందని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కోటను ముట్టడించేందుకు సిద్ధం కండి అంటూ కమల్ ప్రజలకు పిలుపు నిచ్చారు.
‘మీ చేతులకు అవినీతి మరక అంటనీయకండి..నాతో పాటు పోరాటానికి అందరూ సిద్ధం కండి’ అని కమల్ పేర్కొన్నారు. కాగా, ‘ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని..’ అంటూ గతంలో కమల్ తన కవితలో పేర్కొనడం విదితమే.