: బాలయ్య కొత్త సినిమాకు సంబంధించి మరో మేకింగ్ వీడియో విడుదల
నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న పైసా వసూల్ సినిమాకు సంబంధించి మరో మేకింగ్ వీడియోను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ, శ్రియా షూటింగ్‌లో పాల్గొంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన నటుల ఇంటర్వ్యూలను, ఈ సినిమాను తెరకెక్కించిన తీరును కూడా చూపిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ పాట పాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.