: అసభ్యకర సీన్లు, డైలాగులు ఉన్నాయి: ‘అర్జున్ రెడ్డి’ పై వైసీపీ మహిళా నేతల ఫిర్యాదు
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ముద్దు సీన్లు, అసభ్యకర డైలాగులు ఉన్నాయని, వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ మహిళా నేతలు ఈ రోజు ఆందోళన నిర్వహించారు. ఈ సినిమాపై జాయింట్ కమిషనర్ రమణ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ సినిమా ఉందని అన్నారు. అన్ని ఛానెళ్లలో అసభ్యకరంగా ఆ సినిమాకు సంబంధించిన సీన్లు, డైలాగులతో యాడ్స్ కూడా వస్తున్నాయని, ఆ సినిమాకు వెళ్లకపోయినా ఇంట్లోని పిల్లలు ఆ యాడ్స్ చూసి చెడిపోతున్నారని వారు అన్నారు. ఇటువంటి సినిమాలు సమాజానికి మంచివి కావని అన్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి చెడు సినిమాలు రాకుండా చూడాలని వారు కోరారు.