: జీఎస్టీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు


నిన్నటి ట్రేడింగ్ లో నష్టాలను చవిచూసిన భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటంతో... ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. జీఎస్టీ వసూళ్లు అంచనాలకు మించి రావడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 31,646కు ఎగబాకింది. నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 9,884కు చేరుకుంది. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో బీఎఫ్ యుటిలిటీస్ లిమిటెడ్, జైప్రకాశ్ అసోసియేట్స్, బాంబే డయింగ్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అదానీ పవర్ షేర్లు లాభపడగా... మైండ్ ట్రీ లిమిటెడ్, రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్, కేర్ రేటింగ్స్, సింగేనే ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఏఐఏ ఇంజినీరింగ్ తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి. 

  • Loading...

More Telugu News