: పాఠశాలలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అమెరికన్.. 105 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రోన్నీ లీ రోమన్ పాఠశాలలో కోచ్గా పనిచేస్తూ కొన్నేళ్ల పాటు చిన్నారులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ నేరాలకు గాను ఈ మృగాడికి అక్కడి కోర్టు 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. చిన్నారులకు కోచింగ్ ఇస్తోన్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశాడు.
దాంతో అతడిపై 2014లో కోర్టులో కేసు నమోదుకాగా, దీనిపై విచారణ జరిపిన లాస్ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు.. 2012-14 మధ్య కహుంగ ఎలిమెంటరీ స్కూల్లో ఆ వ్యక్తి పనిచేసినప్పుడు కూడా 8-11ఏళ్ల వయసున్న ఐదుగురు చిన్నారులపై కూడా ఇలా ప్రవర్తించాడని తేల్చింది. అంతేగాక, అంతకుముందు అతడు వినే స్ట్రీట్ ఎలిమెంటరీలో పనిచేశాడని ఆ సమయంలోనూ మరో చిన్నారిని లైంగికంగా వేధించాడని స్పష్టం చేసింది.