: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న `దృశ్యం` పాప!
`దృశ్యం` చిత్రంలో వెంకటేశ్, మీనాల చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. `దృశ్యం` సినిమాలో తన నటనతో అందరి మనసులను దోచుకున్న ఎస్తేర్ మలయాళం సినిమా ద్వారా కథనాయికగా తెరంగేట్రం చేస్తోంది. `దృశ్యం` సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో చిన్న కూతురు పాత్రను ఎస్తేర్ పోషించింది. నటించిన అన్ని భాషల్లోనూ ఈ పాత్ర తనకు మంచి పేరు తీసుకువచ్చింది. అంతేకాకుండా కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా పెద్ద హీరోల కూతురిగా నటించి, మంచి మార్కులు కొట్టేసింది. షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్న `పయ్యార్` సినిమా ద్వారా ఎస్తేర్ కథానాయికగా పరిచయం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ, ఈషా తల్వార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.