: 'అర్జున్ రెడ్డి'కి మరో వివాదం: కథ కాపీ కొట్టారంటూ దర్శక నిర్మాతలకు నోటీసులు


వివాదాల మధ్య విడుదలై, భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది 'అర్జున్ రెడ్డి' సినిమా. అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్ లు ఈ సినిమాలో ఉన్నాయని... ఈ సినిమాను నిషేధించాలని కూడా పలువురు డిమాండ్ చేశారు. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథను తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారుచేసుకున్నానని దర్శకుడు సందీప్ రెడ్డి చెబుతుండగా... ఆ కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు డి.నాగరాజు అంటున్నాడు.

అంతేకాదు, దీనికి సంబంధించి దర్శక, నిర్మాతలకు నోటీసులు కూడా పంపాడు. గతంతో తాను తెరకెక్కించిన 'ఇక సె..లవ్' సినిమా కథనే యథాతథంగా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని... తన అనుమతి లేకుండా తన కథతో సినిమా తీసినందుకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని... లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News