: ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో 'తానాజీ'ని తెరకెక్కించాలనుకుంటున్నాం!: హీరో అజయ్ దేవగణ్


మరాఠా యోథుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో సేనాధిపతిగా వ్యవహరించిన సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా తెరకెక్కించనున్న బాలీవుడ్ చిత్రం ‘తానాజీ : ది అన్ సంగ్ వారియర్’. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాహుబలి’ సినిమాతో పోటీపడటం లేదని, అయితే, ఈ సినిమాను ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో తెరకెక్కించాలని మాత్రం అనుకుంటున్నామని అన్నారు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని చూస్తున్నామని, మనం తీసే చిత్రాల్లో భావోద్వేగాలు, నాటకీయత మొదలైనవి ఎక్కువగా ఉండాలని అన్నారు. అలా తీయలేని పక్షంలో మన సినిమాలను హాలీవుడ్ సినిమాలు భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News