: బోయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ రియాసేన్!


బాలీవుడ్ నటి రియాసేన్ తన బోయ్ ఫ్రెండ్ శివం తివారీని పెళ్లాడింది. ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థ యజమాని అయిన శివం తివారీతో ఆమె చాలా కాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయిందని, నెల రోజుల్లోగా వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు రెండ్రోజుల క్రితం వెలువడ్డాయి. అయితే, వీరిద్దరి పెళ్లి ఇప్పటికే అయిపోయిందంటూ ఇంతలోనే వార్త బయటకు వచ్చింది. పూణెలో జరిగిన వీరి వివాహానికి కేవలం కుటుంబంసభ్యులు, కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారట. ఆమె సోదరి, హీరోయిన్ రైమా సేన్ వీరి పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News