: షష్టి పూర్తి చేసుకోవాల్సిన సమయంలో నివాళి అర్పించడం చాలా బాధగా ఉంది: పరిటాల సునీత


అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల రవి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ లతో పాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, రవి 60వ ఏట షష్టి పూర్తి చేసుకోవాల్సిన సమయంలో, ఆయనకు నివాళి అర్పించడం చాలా బాధగా ఉందని చెప్పారు. రవి ఆశయాలను ముందుకు తీసుకెళతామని తెలిపారు. దేవినేని ఉమా మాట్లాడుతూ, ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప నేత రవి అని కితాబిచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే రవిని హత్య చేశారని... అలాంటి సంస్కృతిని ఇప్పటికైనా వదిలిపెట్టాలని అన్నారు. రవి మరణించినా ప్రజల గుండెల్లో ఆయన చేసిన పోరాటాలు గుర్తుంటాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News