: మతాలకతీతంగా ప్రార్థన స్థలాల సాయం... వరదల్లో చిక్కుకున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న వైనం
భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పీకల్లోతు నీటిలో మునిగిపోయిన ముంబై మహానగరంలో చిక్కుకుపోయిన వారికి అక్కడి ప్రార్థనా స్థలాలు మతాలకతీతంగా సహాయం చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న అపరిచితులను స్వయంగా తామే కాంటాక్ట్ చేసి, ఆశ్రయం కన్పిస్తున్నారు. దేవాలయాలు, చర్చిలు, దర్గాలు, మసీదులు ఇలా అన్ని ప్రార్థనా స్థలాలు ముంబై సందర్శించిడానికి వచ్చిన పర్యాటకులతో నిండిపోయాయి. అంతేకాకుండా స్థానికులు కూడా అపరిచితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. బైకులు వేసుకుని వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి, తమ ఇళ్లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్‌కు పక్కనే ఉన్న మూడంత స్తుల ఛిస్తీ హిందుస్థానీ మసీదులో ఆశ్రయం పొందారు.