: వర్షాలను లెక్కచేయకుండా బీచ్‌ను శుభ్రం చేస్తున్న ముంబై వాసి
భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా గణేశ్ నిమజ్జనం కారణంగా బీచ్‌లో పేరుకున్న వ్యర్థాలను అర్ధరాత్రి వరకు శుభ్రం చేస్తున్నాడు ముంబై వాసి అఫ్రోజ్ షా. `ఎందుకంత కష్టపడుతున్నావ్?` అని ఎవరైనా ప్రశ్నిస్తే `నా బీచ్‌ను నేను కాకపోతే ఎవరు కాపాడుకుంటారు?` అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అఫ్రోజ్ తన పది మంది వాలంటీర్ల బృందంతో కలిసి వెర్సోవా బీచ్ గణేశ్ నిమజ్జన వ్యర్థాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. గత కొన్ని వారాలుగా అఫ్రోజ్ చేస్తున్న కృషిని స్థానికులతో పాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మెచ్చుకున్నారు.