: ట్విట్టర్ వీరుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు?.. మెగా ఫ్యామిలీ అనేది రాజుల ఫ్యామిలీ కాదు: మహేష్ కత్తి


తనను చంపుతామంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నప్పటికీ... ట్విట్టర్ వీరుడు పవన్ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని ఫిల్మ్ క్రిటిక్ మషేష్ కత్తి ప్రశ్నించారు. మషేష్ ను వదిలేయండని ట్విట్లర్ ద్వారా ఒక కామెంట్ పోస్ట్ చేయవచ్చు కదా? అని అన్నారు. పవన్ స్పందించపోవడం వల్ల ఆయన అభిమానులు అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

మాట్లాడితే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారని... ఏదో ఫ్యూడల్ లార్డ్ షిప్ లా మాట్లాడుతున్నారని మహేష్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కూడా అన్ని ఫ్యామిలీల మాదిరే ఒక ఫ్యామిలీ అని... అయితే, ఆ ఫ్యామిలీలో ఎక్కువ మంది నటులు మాత్రమే ఉన్నారని చెప్పారు. మెగా ఫ్యామిలీ అనేది రాజుల ఫ్యామిలీ, మనం ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ను ప్రశ్నించకూడదు అనేది... ఈ ప్రజాస్వామ్యంలో ఓ బూతులాంటిదని అన్నారు. ఎందుకంటే ఒక నాయకుడు అనే వ్యక్తిని సమాజంలో ఎంతో మంది ప్రశ్నిస్తారని చెప్పారు. కేవలం సెట్లోకి వచ్చి యాక్టింగ్ చేసినట్టు రాజకీయాలు కూడా చేస్తానంటే ఎలాగని అన్నారు. రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలతో మమేకం అవ్వాలని... అలాకాకుండా, షూటింగ్ స్పాట్ లో ఉండే క్యారవాన్ లోనే ఉంటానని చెబితే రాజకీయాల్లో రాణించడం కష్టమవుతుందని చెప్పారు.

జనసేన పార్టీలో క్లారిటీ వస్తే, తాను కూడా ఆ పార్టీలోనే చేరవచ్చని చెప్పిన మహేష్... ఆ క్లారిటీ తనకు ఇంతవరకు రాలేదని చెప్పారు. స్పెషల్ స్టేటస్ పై కూడా పవన్ కల్యాణ్ కబుర్లు చెప్పారే తప్ప, పూర్తి స్థాయిలో పోరాటం చేయలేదని అన్నారు. తాను సామాన్యుడినేనని, అయితే పవన్ ఫ్యాన్సే తనను సెలబ్రిటీని చేస్తున్నారని చెప్పారు. 

  • Loading...

More Telugu News