: చంపడమే నాకోరిక... సెల్పీని నేనే కనిపెట్టాను: సోనాక్షి సిన్హా


ఎవరినైనా చంపాలని ఉందంటూ చిత్రమైన కోరికను బయటపెట్టింది బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షి సిన్హా. తాజాగా మరో హీరోయిన్ నేహా దుపియా నిర్వహిస్తున్న ‘నో ఫిల్టర్‌ నేహా సీజన్‌ 2’ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సరదాగా సమాధానాలు చెప్పింది. తనలో హింసించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అందుకే ఎవరినైనా హింసించి చంపాలని అనుకుంటున్నాని చెప్పింది. దీంతో ఇద్దరూ పెద్దగా నవ్వేశారు.

సెల్ఫీ ట్రెండ్ తానే కనిపెట్టానని భావిస్తుంటానని సోనాక్షి చెప్పింది. తన దగ్గర డిజిటల్ కెమెరా ఉండేదని తెలిపింది. దానితో ఎప్పుడూ ఫోటోలు తీసేదానినని తెలిపింది. అటూ ఇటూ తిప్పి తన ఫోటోలు తానే తీసుకునేదానినని సోనాక్షి చెప్పింది. ప్రస్తుతం సోనాక్షి, సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News