: నీ ఏడుపు నా హృదయం ద్రవించేలా చేస్తోంది: బాలిక‌కు జమ్మూకశ్మీర్‌ డీఐజీ లేఖ


‘నువ్వు అంత‌గా ఏడుస్తోంటే నా హృదయం ద్రవిస్తోంది’ అంటూ ఓ బాలిక‌కు జమ్మూకశ్మీర్‌ డీఐజీ త‌న ఫేస్‌బుక్ ఖాతా ద్వారా సందేశం పంపారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఫొటోను కూడా పోస్ట్ చేశారు. నిన్న‌ శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జ‌రిపిన‌ కాల్పుల్లో అబ్దుల్‌ రషీద్‌ అనే అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ చ‌నిపోయారు. త‌న నాన్న ఇక‌లేడ‌ని అత‌డి కుమార్తె జోరా బోరున విల‌పించింది. ఆమెను ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్‌ డీఐజీ పోస్ట్ చేస్తూ.. ఆమె తండ్రి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు.

ఆమె తండ్రి విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే వయసు ఆమెకు లేదని డీఐజీ అన్నారు. ఎందరో పోలీసులు కుటుంబానికి, సన్నిహితులకి దూరమై నరకం అనుభవిస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, ఇలాంటి విషయాలే చరిత్రకెక్కి మమ్మల్ని గర్వపడేలా చేస్తాయని అన్నారు. తాము ఖాకీ దుస్తులు వేసుకున్నప్పుడు దేశానికి చేసిన ప్రతిజ్ఞ చిరస్మరణీయమ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News