: మోసపూరిత వెబ్ సైట్ల ఎఫెక్ట్: ఆయా వెబ్సైట్లలో వాణిజ్య ప్రకటనలకు ఇచ్చిన డబ్బును ఖాతాదారులకు తిరిగి ఇచ్చేస్తోన్న గూగుల్!
మోసపూరితమైన బాట్స్, రోబోస్ని వినియోగించి కృత్రిమ ట్రాఫిక్ పొందుతున్న వెబ్సైట్లపై గూగుల్ దృష్టి పెట్టిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యూజర్ల నుంచి ఒక్క క్లిక్ కూడా రాకపోయినా బాట్స్, రోబోస్ని ఉపయోగించి యాడ్స్ ని ప్రదర్శించినందుకు గానూ ఆయా వెబ్సైట్ల యజమానులకి తాము అనవసరంగా డబ్బు చెల్లించాల్సి వచ్చిందని గూగుల్ చెప్పినట్లు తెలిపింది. దీన్ని ముందుగానే గుర్తించే అవకాశం లేదని చెప్పింది. దీంతో గూగుల్ కొన్ని వందల వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన డబ్బును ఆయా ప్రకటనదారులకు తిరిగి ఇచ్చేస్తోందని తెలిపింది.
అయితే, ఖాతాదారులకు పూర్తిగా కాకుండా ఈ సైట్లలో మొత్తం వాణిజ్య ప్రకటనలకు వెచ్చించిన మొత్తంలో 7 నుంచి 10 శాతం మాత్రమే తిరిగి ఇచ్చేస్తున్నట్లు వివరించింది. గూగుల్‌కి వాణిజ్య ప్రకటనలు ఇచ్చిన సందర్భంగా ఆయా సంస్థలు ఇచ్చిన డబ్బులో కొంత శాతం ఇప్పటికే ఆయా వెబ్సైట్ల యజమానుల, దళారుల ఖాతాల్లో పడిపోయిందని తెలిపింది.