: ఆఖరి శ్వాస వరకూ ‘జై జగన్’ అంటూనే ఉంటా: ఎమ్మెల్యే రోజా
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ‘గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా’ అనే క్యాప్షన్ తో మొదలు పెట్టి ‘నాన్న ఆశయాలే శ్వాసగా బతికావు. నాన్నపై కుట్రలను సహించక దేశాన్ని శాసించే నియంత మెడలు వంచి, నమ్ముకున్న మా కోసం దమ్మున్న నాయకుడిగా నాన్న పేరుతో పార్టీ పెట్టావు. దొంగ హామీలు ఇవ్వలేదు, కుల రాజకీయాలు చేయలేదు, వేరొకరి ప్రభతో వెలగాలనుకోలేదు. సింహంలా సింగిల్ గా నిలిచావు. ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు. జగనన్నా, నీ వెంటే మేముంటాము, ఈ పోరాటంలో మేము సైనికులమవుతాము!’ అని పేర్కొన్న రోజా, ‘ఆఖరి శ్వాస వరకూ ‘జై జగన్’ అంటూనే ఉంటా!’ అని ముగించారు.