: బీమా పేరుతో బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోంది!: ఏపీ కిసాన్‌ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ ఛైర్మన్ జెట్టి గురునాథరావు
బీమా పేరుతో బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఏపీ కిసాన్‌ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ ఛైర్మన్ జెట్టి గురునాథరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెబుతూ 2016 ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు ఇంతవరకూ బీమా అందలేదని ఆయన విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయం నుంచి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి ఎం.ఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేసే ఉద్దేశం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.