: ‘ఐ గాట్ ఏ గర్ల్’ అంటూ బుల్లి డ్యాన్సింగ్ పార్ట్‌నర్‌తో విరాట్ కోహ్లీ చేస్తోన్న నాట్యాన్ని చూడండి!
మొన్న శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించి ఐదు వన్డేల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాము చేసుకున్న సంబరానికి సంబంధించిన ఓ వీడియోను టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇందులో షమీ రెండేళ్ల కూతురు అయిరాతో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తున్నాడు.
తాము సాధించిన విజయానికి తన కూతురు సంబరపడిపోతున్నందుకు షమీ హర్షం వ్యక్తం చేశాడు. ‘ఐ గాట్ ఏ గర్ల్’ అనే పాటకు అయిరా కాళ్లు, చేతులను కదిలిస్తూ చుట్టూ తిరుగుతూ వేస్తోన్న డ్యాన్స్‌ని విరాట్ కోహ్లీ అనుకరించాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. మీరూ చూడండి...