: చైనాకు వెళ్తున్న ప్రధాని మోదీ!


భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలోని జియామెన్ సిటీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరవుతారని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఆ దేశంలో జరగనున్న 9వ బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరవుతారని పేర్కొంది. చైనా పర్యటన ముగిసిన వెంటనే... అక్కడ నుంచి మయన్మార్  పర్యటనకు మోదీ బయల్దేరుతారు. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మయన్మార్ లో పర్యటిస్తారు. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశ పర్యటనకు మోదీ వెళ్లకపోవచ్చని తొలుత కొందరు భావించారు. అయితే, వివాదం సామరస్యంగా పరిష్కారం అవడంతో ప్రధాని, చైనా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

  • Loading...

More Telugu News