: కాబూల్ లోని అమెరికా ఎంబసీ వద్ద బాంబు పేలుడు


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని యూఎస్ ఎంబసీ వద్ద బాంబు పేలుడు సంభవించింది. కాబూల్ లోని పటిష్ఠ భద్రత గల యూఎస్ ఎంబసీని లక్ష్యం చేసుకుని ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో యూఎస్ ఎంబసీకి దగ్గర్లో ఉన్న బ్యాంకుకు వచ్చిన వినియోగదారులు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని ఆత్మాహుతిలో పాల్గొన్న వ్యక్తిగా అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News