: 18 ఐటీ కంపెనీలపై సెబీ నిషేధం... కంపెనీల పేర్లివి!
చట్ట వ్యతిరేకంగా, ట్రేడింగ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవలే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 200 కంపెనీలను డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ప్రమోటర్లు సెక్యూరిటీస్ మార్కెట్లో కాలుమోపకుండా వచ్చే పదేళ్లూ నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఈ కంపెనీల్లో మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగినట్టు విచారణలో తేలిందని తెలిపింది. ఇక ఈ 200 కంపెనీల్లో 19 కొత్త తరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలున్నాయి. వాటి వివరాలివి...
* స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీగా 1985లో ప్రారంభమైన నెట్ కామ్ లిమిటెడ్
* కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ డెవలపర్ స్కింటిల్లా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ
* చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టెలీడేటా ఇన్ఫర్మాటిక్స్
* ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెబ్ అండ్ వ్యాప్ ప్రొడక్టుల సంస్థ ఆడమ్ కామ్సాఫ్ లిమిటెడ్
* కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న ఏఎంఐ కంప్యూటర్స్ (ఇండియా) లిమిటెడ్
* నెట్ వర్కింగ్, హోస్టింగ్ సేవల సంస్థ సీఎస్జే టెక్నాలజీస్
* ఎంటర్ ప్రైజ్ పోర్టల్స్ అభివృద్ధి సంస్థ సీక్వెల్ సాఫ్ట్ ఇండియా లిమిటెడ్
* స్మాల్ అండ్ మీడియం ఐటీ కంపెనీ సాఫ్ట్ ట్రాక్ టెక్నో
* కంప్యూటర్ హార్డ్ వేర్, మానిటర్స్, పీసీబీల తయారీ సంస్థ యూనీపోర్ట్ కంప్యూటర్స్
* కన్సల్టెన్సీ సేవల సంస్థ కావేరీ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ లిమిటెడ్
* మల్టీమీడియా, ఇంటర్నెట్, ఎంటర్ టెయిన్ మెంట్ సేవల కంపెనీ కంప్యూటైన్ విన్ఫోసిస్టమ్స్
* టెక్నాలజీ సొల్యూషన్స్ సేవల సంస్థ కంప్యూటెక్ ఇంటర్నేషనల్
* చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ ధనుష్ టెక్నాలజీస్ లిమిటెడ్
* తొలుత స్క్వేర్ డీ సాఫ్ట్ వేర్ గా ప్రారంభమై ఆపై డీఎస్క్యూ సాఫ్ట్ వేర్ గా మారిన చెన్నై సంస్థ
* కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న యూరోపియన్ సాఫ్ట్ వేర్ అలయన్సెస్ లిమిటెడ్
* కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సేవల సంస్థ ఇన్ఫర్మేషనన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్, తొలుత ఈ సంస్థ ఉషా సర్వీసెస్ అండ్ కన్సల్టెంట్స్ పేరిట పనిచేసింది
* ఐటీ సేవల సంస్థ నెక్సస్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్
* చిన్న తరహా ఐటీ సంస్థ స్కైలిడ్ టెలీకమ్యూనికేషన్ లిమిటెడ్