: 'దాడి'కి కొణతాల పోటు
ఎన్నో ఆశలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత దాడి వీరభద్రరావును అప్పుడే అసమ్మతి సెగలు చుట్టుముట్టాయి. దాడి చేరికతో కొణతాల వర్గంలో కలకలం చెలరేగింది. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు ఆశిస్తున్న కొణతాల సోదరులు దాడి రాకతో బెదిరింపు గళం వినిపిస్తున్నారు. పార్టీని వీడతామంటూ అల్టిమేటమ్ జారీ చేశారు. నేటి సాయంత్రం కొణతాల లక్ష్మీనారాయణ కార్యకర్తలతో సమావేశమై ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ, దాడి వైఎస్సార్సీపీలో చేరింది టీడీపీలో ఆయన్ను పట్టించుకోవడంలేదన్న సాకుతోనేనని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబం మీద ప్రేమతో దాడి పార్టీలో చేరలేదని, పదవికోసమేనని లక్ష్మీనారాయణ ఆరోపించారు.