: ఒక్కో పేరుకు రెండేళ్ల చొప్పున జైలు శిక్ష.. 'డేరా బాబా'పై నెటిజన్ల తమాషా వ్యాఖ్యలు!


20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా సచ్ఛా సౌధా గురువు గుర్మీత్ రాం రహీం సింగ్ పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై తమాషా వ్యాఖ్యలతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. గుర్మీత్ కు కేవలం రెండేళ్ల జైలు శిక్ష పడిందని వారు పేర్కొంటున్నారు. తొలుత 10 ఏళ్ల జైలు అని మీడియాలో వార్తలు రావడంతో ఒక నెటిజన్... ‘కోర్టు అతనికి పదేళ్ల శిక్ష ఎందుకు విధించిందో తెలుసా..? గుర్మీత్‌ కు-2 ఏళ్లు, రామ్‌ కు-2 ఏళ్లు, రహీమ్‌ కు-2 ఏళ్లు, సింగ్‌ కు-2 ఏళ్లు, బాబాకు-2 ఏళ్లు. ఇలా ఒక్కో పేరుకు రెండేళ్లు’ శిక్ష పడిందని వ్యాఖ్యానించారు.

మరో నెటిజన్ ‘అత్యాచారం కేసులో శిక్ష ఇప్పుడు ఖరారైంది. ఇక హత్య కేసులో తీర్పు రావాలి. ఇక బాబా జీవితం జైలుకే అంకితం’ అంటూ ఎధ్దేవా చేశాడు. ఇంకో నెటిజన్ ‘రాక్‌ స్టార్‌ లవ్‌ ఛార్జర్‌ ఇక మరో పదేళ్లు మనకు కనిపించడు.’ అన్నాడు. మరో నెటిజన్  ‘యే దస్‌ సాల్‌.. గుర్మీత్‌ కే నామ్‌’ అంటూ ఆసక్తికరంగా స్పందించాడు. మరొక నెటిజన్ అయితే ‘ఓ దొంగబాబాకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఇక నకిలీ బాబాలు జాగ్రత్త. ఇది మీకో హెచ్చరిక’ అంటూ దొంగ బాబాలందరికీ హెచ్చరికలు చేశారు.

  • Loading...

More Telugu News