: స్టాలిన్ సహా 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చిన సభాహక్కుల కమిటీ


తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, విపక్ష నేత ఎంకే స్టాలిన్‌ సహా 20 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. గత జులై 19న నిషేధిత గుట్కాను శాసనసభలోకి తీసుకొచ్చినందుకు వీరికి ఈ నోటీసులు జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా, నిషేధిత గుట్కాలు తమిళనాడులో విరివిగా దొరుకుతున్నాయని, వాటిని నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపిస్తూ స్టాలిన్ తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభలో వాటిని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News