: నందన్ నీలేకని రాకతో పుంజుకుంటున్న ఇన్ఫీ షేర్ విలువ... రూ. 953.50కి చేరిక
నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నందన్ నీలేకని కంపెనీలో అడుగుపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్‌లో ఇన్ఫోసిస్ షేర్ విలువ పుంజుకుంటోంది. దాదాపు 4.5 శాతం వృద్ధితో సోమవారం ఉదయానికి షేర్ విలువ రూ. 953.50కి చేరుకుంది. విశాల్ సిక్కా సీఈఓ పదవికి రాజీనామా చేసిన రోజు ఇన్ఫోసిస్ షేర్ విలువ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత నందన్ నీలేకని వస్తున్నారన్న వార్త వల్లే షేర్ల విలువ పుంజుకోవడం ప్రారంభించింది. ఇక నందన్ నీలేకని గురించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత షేర్ల ధర పెరుగుదల వేగం మరింత పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇన్ఫోసిస్ షేరుకు పునర్వైభవం రాబోతుందనడంలో సందేహం ఉండదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.