: 'అర్జున్ రెడ్డి' దెబ్బకు స్టార్ హీరోల రికార్డులు బద్దలు!


విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఓవర్సీస్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తన రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

ఓవర్సీస్ లో ప్రీమియర్ షోతో పాటు, మొదటి రోజు కలెక్షన్లను కలిపి 4లక్షల 60వేల డాలర్లును 'అర్జున్ రెడ్డి' రాబట్టింది. అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా ఇవే షోలకు గాను 3లక్షల 96వేల డాలర్టను వసూలు చేసింది. నాని తాజా హిట్ మూవీ ‘నిన్ను కోరి’కి 3 లక్షల 82వేల డాలర్లు వచ్చాయి. అయితే రామ్ చరణ్ నటించిన 'ధృవ' సినిమా మాత్రం 'అర్జున్ రెడ్డి' కంటే 9వేల డాలర్లను ఎక్కువ కలెక్ట్ చేసింది. చరణ్ మూవీకి 4లక్షల 69వేల డాలర్ల కలెక్షన్ వచ్చింది.  

  • Loading...

More Telugu News