: `మోదీ కూడా ఒక బాబానే`... రాధే మా వ్యాఖ్య‌లు


ఒక‌రి త‌ర్వాత ఒక‌రి చొప్పున బాబాలు కేసుల పాలై అరెస్టు కావ‌డంపై రాధే మాను ప్ర‌శ్నించగా `మోదీ కూడా ఒక బాబానే... మ‌రి ఆయ‌న ఎందుకు అన్నీ మంచి ప‌నులే చేస్తున్నారు?` అంటూ అర్థం కాకుండా స‌మాధానం ఇచ్చింది. అలాగే ఆమెను దొంగ‌దేవ‌తగా వర్ణిస్తూ బాలీవుడ్ న‌టుడు రిషి క‌పూర్ చేసిన ట్వీట్‌పై కూడా రాధే మా స్పందించింది.

`రిషి క‌పూర్ చాలా మంచి వ్య‌క్తి. అత‌ను ఇంతవ‌ర‌కు ఏ త‌ప్పు చేయ‌లేదు. న‌న్ను అవ‌మానించ‌డం వ‌ల్ల శివుడు అత‌నికి త‌ప్పు చేసే సౌక‌ర్యం క‌ల్పించాడు. త్వ‌ర‌లోనే ఆ మాట‌ల‌కు ఆయ‌నే స‌రైన స‌మాధానం చెబుతాడు` అంది. హార్యానా, పంజాబ్‌ల్లో రామ్ ర‌హీమ్ అనుచ‌రులు చేస్తున్న హింసాకాండ గురించి అడ‌గ్గా - `నేను నిరంత‌రం శివుని భ‌క్తిలోనే మునిగితేలుతాను. ఒక సాధువురాలిగా నా బిడ్డ‌ల బాధ్య‌త‌ల‌ను చూసుకోవ‌డానికే నాకు స‌మ‌యం చాల‌డం లేదు. అందుకే బ‌య‌ట ఏం జ‌రుగుతుందో పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక‌వేళ ఏదైనా జ‌రిగినా అది శివుని ఆదేశం మేర‌కే జ‌రిగింద‌ని భావిస్తాను` అని వివ‌రించింది.

  • Loading...

More Telugu News