: జగన్ ని ప్రజలు తిరస్కరించారు..టీడీపీని ఆదరించారు: నారా చంద్రబాబునాయుడు
నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. నంద్యాలలో జగన్ పదిహేనురోజుల పాటు బస చేసి ప్రలోభాలకు పాల్పడినా ప్రజలు తిరస్కరించారని, అన్ని వర్గాల ప్రజలు టీడీపీని ఆదరించారని అన్నారు. ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అవినీతిని నిర్మూలించి, ప్రజలు మెచ్చుకునే పాలన అందించి, శాశ్వతంగా టీడీపీ అధికారంలో ఉండేలా చేస్తామని అన్నారు. నంద్యాల ఉపఎన్నిక ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనమని అన్నారు.