: చైనాలో ప్రేమికుల కోసం పరుగులు పెడుతున్న అమ్మాయిలు!


ఈ రోజు చైనా యువ‌త  క్విగ్జి పండుగను జ‌రుపుకుంటోంది. దీనికి మ‌రో పేరే చైనా ప్రేమికుల రోజు. ఈ రోజున ఆ దేశంలో ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఈ సందర్భంగా యువతులంతా క‌లిసి పరుగులు తీస్తూ క‌నిపిస్తారు. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం తెలియక చేసిన పొరబాటు కారణంగా ఓ పశువుల కాపరి, అతని భార్య ఓ ముని శాపానికి గురయ్యారని చైనాలో ఓ కథ ప్ర‌చారంలో ఉంది.

కళ్ల ఎదుటే వారిరువురూ కనిపిస్తున్నా, ఒక‌రినొక‌రు క‌లుసుకోకుండా ఇద్దరి మధ్య ఓ నది ఉండేది. ప్రతి ఏడాది ఏడో పౌర్ణమి రోజున మాత్రం వారు కలుసుకోవడానికి వీలు ఉండేది. ఆ నదిని సిల్వర్‌ రివర్ అంటారు. వారికి గుర్తుగా చైనీయులు ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఆ ఆన‌వాయితీని చైనాలో ఇప్ప‌టికీ పాటిస్తున్నారు. అమ్మాయిలంతా కలిసి తమ ప్రియుల కోసం పరిగెడుతూ కనపడుతున్నారు.  

  • Loading...

More Telugu News