: సీన్ రివర్స్... ఫేస్ బుక్ తో వలేసి ముంచేసే ప్రభుత్వ కి'లేడీ' కటకటాల్లోకి!


ఫేస్ బుక్ లో తప్పుడు ఖాతాలు తెరిచి, అమ్మాయిలను పటాయించి, వారిని మోసం చేస్తున్న కేసులు ఎన్నో వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వ ఉద్యోగినిగా ఉన్న ఓ యువతి, ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన వారిలో ధనవంతులను గుర్తించి, వారిని వల్లో పడేసుకుని, ఆపై డబ్బు డిమాండ్ చేస్తూ, ముంచుతున్న కిలేడీని కర్ణాటక పోలీసులు కటకటాల వెనక్కు పంపారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే... మధుగిరి పట్టణంలోని రాష్ట్ర విద్యుత్ కార్యాలయంలో తుముకూరు జిల్లా దొగ్గనహళ్ళికి చెందిన దొడ్డ మణి (28) క్లర్కుగా పనిచేస్తోంది. గత మూడేళ్ల నుంచి ఫేస్ బుక్ ఖాతాను నిర్వహిస్తూ, ధనవంతులైన వారిని గుర్తించి, వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేది. ఆపై వారితో స్నేహం చేసి, ప్రేమలోకి దింపి, సినిమాలకు, షికార్లకూ వెళ్లేది. ఆ సమయంలో వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన మొబైల్ లో నిక్షిప్తం చేసుకున్న తరువాత, తన అసలు స్వరూపాన్ని బయటపెట్టేది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే, ఆ ఫోటోలను అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది. ఆమె చేతిలో మోసపోయిన యువకుల్లో నలుగురు పోలీసులను ఆశ్రయించగా, ఆదివారం నాడు మణిని అరెస్ట్ చేశారు. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News